సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు. కోదాడ వద్ద కారు లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా విచారం వ్యక్తం చేశారు.