జీవనశైలి మార్పులతో ఆరోగ్య సమస్యలు పెరుగుతుండటంతో ప్రజలు తిరిగి చిరుధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి ఇక్రిశాట్ సైంటిస్టులు ర్యాపిడ్ రాగి అనే విప్లవాత్మక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇది కేవలం 68 రోజుల్లోనే పంటనిస్తుంది. సాంప్రదాయ రాగి పంట 135 రోజులు పట్టగా.. ర్యాపిడ్ రాగి ఏడాదికి 5 పంటలు పండనుంది. రైతులకు లాభాలను పెంచడమే కాకుండా.. చిరుధాన్యాల లభ్యతను గణనీయంగా పెంచుతుందని సైంటిస్టులు తెలిపారు.