లక్కీ భాస్కర్ లెక్కన సంపాదిద్దామని.. హాస్టల్ గోడ దూకి విద్యార్థుల పరారీ..!

1 month ago 4
విశాఖపట్నంలో నలుగురు విద్యార్థులు అదృశ్యం కావటం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ బోర్డింగ్ హోమ్‌ నుంచి నలుగురు విద్యార్థులు గోడదూకి పారిపోయారు. అయితే విద్యార్థులు నలుగురు లక్కీ భాస్కర్ సినిమా చూశారని.. అందులో హీరో మాదిరిగా కోట్లు సంపాదించాలంటూ హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. ఈ ఘటనపై మహారాణిపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీని కనిపెట్టేందుకు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Entire Article