లక్ష కోట్ల డ్రామాలు.. బాబువన్నీ పిట్టలదొర మాటలే : సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు

1 hour ago 2
సీఎం చంద్రబాబునాయుడుపై.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మండిపడ్డారు. రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కోసం ఏకంగా రూ. లక్ష కోట్లు కేటాయిస్తామంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. చంద్రబాబువన్నీ పిట్టలదొర మాటలేనని X వేదకగా ధ్వజమెత్తారు. రాయలసీమలో ప్రస్తుతం తీవ్రమైన దుర్భిక్షం ఉందని, ఈ వాస్తవాన్ని పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం 'హార్టికల్చర్ హబ్'ల పేరుతో పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. అక్కడ రైతులు ప్రస్తుతం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ అవస్థలను చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు.
Read Entire Article