Lagacharla Attack Issue: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే.. ఫార్మాసిటీ కోసం లగచర్లలో భూసేకరణను నిలిపేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డికి భారీ ఊరట లభించింది. దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు వేరువేరుగా మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా.. అందులో రెండింటిని హైకోర్టు కొట్టేసింది.