వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో కుట్రకోణం దాగి ఉందని హైదరాబాద్ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాత్ర ఉందని, అందుకే ఆధారాలతో ప్రధాన నిందితుడిగా చేర్చామని చెప్పారు. మరింత లోతుగా విచారణ చేసి వివరాలు తెలుసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. దాడిలో పాల్గొన్న 42 మందిని గుర్తిస్తే, వారిలో 19 మందికి అసలు భూమే లేదని తేలిందన్నారు. ప్రాథమిక విచారణలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.