వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులకు బేడీలు వేసి అవమానించారని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని ప్లకార్డులు తీసుకొని లోపలికి పంపించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభం తర్వాత ఈ ఘటనపై బీఆర్ఎస్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ తిరస్కరించారు.