గ్రామసభ లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన పథకాలు వచ్చినట్లు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పటి వరకు లిస్టు ఫైనల్ కాలేదని అన్నారు. ప్రస్తుతం అఫ్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నామని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. అప్లయ్ చేసుకోని వారు ఉంటే.. గ్రామసభల్లో అప్లయ్ చేసుకోవచ్చునని అన్నారు.