సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద కేసు నమోదైంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. తనను బెదిరించి లొంగదీసుకున్నారంటూ ఓ మహిళ కోనేటి ఆదిమూలం మీద ఆరోపణలు చేయటం, కొన్ని వీడియోలు విడుదల చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ హైకమాండ్ సైతం ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా తిరుపతిలో ఆయనపై కేసు నమోదైంది. అయితే ఇదంతా రాజకీయంగా తనను ఎదుర్కొలేక ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా కోనేటి ఆదిమూలం చెప్తున్నారు.