నిజామాబాద్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతికి గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ‘మామోప్లాస్టీ’ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా గత మూడేళ్లుగా ఆమె వక్షోజాలు అసాధారణంగా పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రొఫెసర్ డాక్టర్ కె.సునీల్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి.. శరీర ఆకృతిని కాపాడుతూ ఈ సర్జరీని పూర్తి చేశారు. 20 రోజుల నిశిత పరిశీలన తర్వాత యువతి పూర్తిగా కోలుకుందని... ఎటువంటి ఇన్ఫెక్షన్ల ముప్పు లేదని వైద్యులు ధృవీకరించారు.