వచ్చే నెల చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లోకల్ లీడర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. వారి ఒత్తిడి మేరకు ఫిబ్రవరి చివర్లో ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఎలక్షన్ కోడ్ లోపు పథకాల అమలు పూర్తి కాకపోతే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే ఛాన్సుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచిస్తే మాత్రం ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.