వరంగల్ జిల్లాలో కోతుల విక్రయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరంలో జనావాసాల్లోకి వస్తున్న కోతులను పట్టుకున్న కాంట్రాక్టర్.. ఆ వానరాలను ఓ వ్యాపారికి విక్రయించినట్లు వార్తలు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే 50 వానరాలను ఆ వ్యాపారి.. కాంట్రాక్టర్‌కు ఏకంగా రూ.2 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరుపుతామని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?