వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీలో ఓపీ సేవలు.. దసరా నాటికి ప్రారంభించాల్సిందే.. !

1 hour ago 1
వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల్లో జాప్యంపై సీఎంవో అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పూర్తికావాల్సిన నిర్మాణానికి మరింత గడువు కోరడంపై కాంట్రాక్టర్, ఆర్‌అండ్‌బీ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం నాలుగు అంతస్తులు మాత్రమే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. దసరా నాటికి మరో నాలుగు అంతస్తుల పనులు పూర్తి చేసి ఓపీ సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్మికుల సంఖ్య పెంచి, 24 గంటలూ పనులు చేపట్టాలని ఆదేశించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ పర్యటన దసరా తర్వాతకు వాయిదా పడింది.
Read Entire Article