సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మార్కాపురం సమీపంలో వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్.. వర్రా రవీందర్ రెడ్డిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వర్రా రవీందర్‌రెడ్డితో పాటుగా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు వాడిన భాషపై కోయ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.