వాటి నిర్మాణాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.20 కోట్లు కేటాయింపు..

1 month ago 5
వరంగల్ లోని చారిత్రక శ్రీభద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 20 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 30 కోట్లు కాగా.. మిగిలిన రూ. 10 కోట్లను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భరించనుంది. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విన్నపం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను కేటాయించారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మాడవీధులలో గ్రానైట్ ఫ్లోరింగ్, ఆధునిక లైటింగ్ , సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. నిధుల విడుదలవ్వడంతో మూడు నెలలుగా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
Read Entire Article