ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదేనేమో. కరోనా సమయంలో ఉపాధిని కోల్పోయిన వేళ.. తన కొడుక్కి వచ్చిన యూట్యూబ్ ఛానెల్ ఐడియా తమ జీవితాలను మార్చేసిందని ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ అని అందరికీ పరిచయం అయిన మురాల వెంకటేష్ తెలిపారు. స్టార్టింగ్‌లో వీడియోలు సరిగా పోకపోవడంతో కొంత కాలం తర్వాత మానేద్దామని అనుకున్నానని.. కానీ తన కొడుకు పట్టుబట్టి మరీ వీడియోలు చేయించాడని ఆయన చెప్పుకొచ్చారు. తన జీవిత విశేషాలను ఆయన పంచుకున్నారు.