వికారాబాద్ జిల్లా పరిగి వద్ద ఓ భారీ ట్రాన్స్‌ఫార్మర్ ట్రక్ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏడు అంతస్తుల ఎత్తులో ఉన్న ఈ ట్రక్కును చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పూణె నుండి కాంచీపురం వెళ్తున్న భారీ ట్రాన్స్‌ఫార్మర్ ట్రక్కు నెల రోజుల క్రితం తన ప్రయాణాన్ని మెుదలు పెట్టింది. అయితే హైవేపై సూచిక బోర్డుల కారణంగా ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.