తిరుపతి జనసేన పార్టీ ఇన్‌చార్జి కిరణ్ రాయల్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా కిరణ్ రాయల్ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది.