అనంతపురం జిల్లాలో అప్పాజీపేటలో వారం రోజులుగా గాల్లోంచి రాళ్లు పడుతున్నాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో.. ఎలా పడుతున్నాయో అర్థం కాక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఘా పెట్టిన సమయంలో ఈ రాళ్లు పడ్డాయి. దీంతో ఇది ఏ దెయ్యం పనో అని గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వామిజీల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. అయితే ఆకతాయిల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలు మాత్రం రాత్రిపూట నిద్రపోలేకపోతున్నామని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించమని కోరుతున్నారు.