సీనియర్‌ సిటిజన్లకూఫ్రీ బస్సు... తెలంగాణ సర్కార్‌ ఆలోచన..?

1 hour ago 3
తెలంగాణలో సీనియర్‌ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. ఇదే తరహాలో వృద్ధులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు దాటిన వారికి టికెట్‌ ధరపై 25 శాతం రాయితీ అమల్లో ఉండగా.. తెలంగాణలో మాత్రం పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఆర్టీసీపై ఉన్న ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Entire Article