అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 31 ఏళ్ల మహిళ దారం సుప్రియ మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన ఆమె ఉద్యోగరీత్యా మిస్సోరిలో నివసిస్తున్నారు. తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో భారతీయ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో మహబూబాబాద్‌లోని కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.