KBR Park: కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టుకు బ్రేక్‌.. రూ.1,090 కోట్ల పనులు రద్దు.. వన్‌వేతో ట్రాఫిక్‌ క్లియర్‌

1 hour ago 2
Hyderabad Traffic: హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు చుట్టూ ఏడు కూడళ్లలో చేపట్టాలని భావించిన రూ.1,090 కోట్ల స్టీల్‌ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. వన్‌వే విధానం అమలు చేసిన తర్వాత ట్రాఫిక్‌ సమస్య గణనీయంగా తగ్గడంతో భారీ వ్యయంతో నిర్మాణాలు చేపట్టడం అవసరం లేదని ప్రభుత్వం భావించింది. జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు గేట్, ముగ్ధా జంక్షన్‌, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో పనులను నిలిపివేశారు. కాంట్రాక్టర్లు కేఎన్‌ఆర్‌, మేఘాతో చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేశారు. ఇదే సమయంలో పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు కొత్త ఎలివేటెడ్‌ కారిడార్‌కు మార్గం సుగమమైంది.
Read Entire Article