ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామీణ కూలీలకు నిరంతర ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వీబీ జీరాంజీ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 15 రోజుల్లోనే కార్డులు అందించాలని ఆదేశించింది. ఇప్పటికే 18 జిల్లాల్లోని 265 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. పంటల సాగు తగ్గడంతో కూలీలకు పనులు, ఆదాయం తగ్గిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో రోజుకు 100 నుంచి 150 మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.