తిరువూరు ఎమ్మెల్యే - విజయవాడ ఎంపీ మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓ టీచర్‌ని కొట్టారనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే కొలికపూడి నేరుగా స్పందించారు. ఎంపీ కేశినేని చిన్ని డైరెక్షన్‌లోని నేతలే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే తాటతీస్తా.. తోలుతీస్తా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.