Nandigama Chicken Mutton Shop Bandh: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. చికెన్, మటన్, చేపల విక్రయాలని నిలిపివేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 8 వరకు షాపులు మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. నందిగామ పట్టణ పరిధిలోని చందాపురంలో గత కొన్ని రోజులుగా డయేరియా కేసులు పెరిగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్రీ పాయింట్లు, హోటల్స్‌లో కూడా నాన్‌వెజ్ వంటకాల విక్రయించ కూడదని ఆదేశించారు.