Ap High Court On Yv Subba Reddy Petition: టీటీడీ బోర్డు చైర్మన్‌గా తాను తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణను కొట్టేస్తూ ఆదేశాలివ్వాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు వీలుగా చట్టం అనుమతించిన మేరకు ఫైల్స్ సుబ్బారెడ్డికి అందజేయాలని విజిలెన్స్ అధికారులకు కోర్టు తెలిపింది. ఆ తర్వాత మూడు వారాల్లో విజిలెన్స్ అధికారుల నోటీసులకు వివరణ ఇవ్వాలని సుబ్బారెడ్డిని ఆదేశించింది.