వారికి శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రతీ నెల 10వ తేదీలోపే అకౌంట్లోకి డబ్బులు..

6 months ago 10
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా చెల్లింపులు చేయడానికి సిద్ధమవుతోంది. ఇకపై ప్రతినెలా 10వ తేదీలోపు వంటకార్మికుల జీతాలు వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతాయి. హెడ్‌మాస్టర్‌ ఆమోదం తర్వాత ఎంఈవో అప్రూవల్‌తో బిల్లులు ఆటోమేటిక్‌గా ట్రెజరీ నుంచి విడుదలవుతాయి. ఇందుకోసం ఎండీఎం యాప్‌ అభివృద్ధి చేశారు. ఇప్పటిదాకా బకాయిల కారణంగా కార్మికులు ఇబ్బందులు పడగా, ఈ కొత్త విధానం వారికి ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article