తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఊరటనిస్తూ.. ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ. 33 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ కమిషనర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ రుణమాఫీ, అంతకుముందు రైతు రుణమాఫీతో సహా.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ చర్య ద్వారా చేనేత కార్మికులపై అప్పుల భారం తగ్గి, చేనేత పరిశ్రమకు ఆర్థిక స్థిరత్వం లభించనుంది.