సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 19 నెలల్లో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు సైబర్ మోసాల్లో రూ.102 కోట్లు నష్టపోయారు. మొత్తం 403 కేసులు నమోదయ్యాయి. ఇందులో 113 ట్రేడింగ్ మోసాల్లో రూ.55 కోట్లు, 69 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో రూ.31 కోట్లు పోయాయి. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, వాట్సాప్, టెలిగ్రామ్, పోలీసుల పేరుతో వీడియో కాల్స్ ద్వారా నేరగాళ్లు వృద్ధులను మోసం చేస్తున్నారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే గోల్డెన్ అవర్‌లో ఖాతాలను ఫ్రీజ్ చేసి నిధుల రికవరీకి అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.