జీహెచ్ఎంసీ పరిధి 650 నుండి 2060 చదరపు కిలోమీటర్లకు విస్తరించిన నేపథ్యంలో, వార్డుల పునర్విభజనపై వచ్చే ప్రతి అభ్యంతరాన్ని పరిశీలిస్తామని కమిషనర్ కర్ణన్ తెలిపారు. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనం తర్వాత శాస్త్రీయంగా వార్డులను విభజించామన్నారు. నాలాలు, రోడ్లు, రైల్వే లైన్లను హద్దులుగా తీసుకున్నామని, వార్డుల పేర్ల మార్పుపైనే ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో జనాభా పెరిగే అవకాశం ఉన్న తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో వార్డులను పెంచామని వివరించారు. ఈ ప్రక్రియను డిసెంబర్ చివరికి పూర్తి చేసి జనగణనకు సిద్ధం చేయాలని కేంద్రం సూచించిందని.. అభ్యంతరాలు తెలపడానికి రేపే ఆఖరి రోజని ఆయన పేర్కొన్నారు.