కడప మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతోనూ, వారి తల్లిదండ్రులతోనూ ముచ్చటించిన పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. హీరోలను సినిమాల్లో కాకుండా ఉపాధ్యాయుల్తో చూడాలని విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యా్ర్థులు సోషల్ మీడియాను తక్కువగా వాడేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇక పాఠశాలల స్థలాలు కబ్జాకు పాల్పడే వారిపై గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.