బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీఆర్ఎస్ రాజాసింగ్ హెచ్చరించారు. ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో పోలీసు అధికారులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన రాజాసింగ్.. వార్నింగులు ఇచ్చి పోలీసు శాఖను ప్రభావితం చేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా గతంలో రేవంత్ రెడ్డి అరెస్టు విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే.. సొంత పార్టీ నేతలపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు రాజాసింగ్.