కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ట్రోలింగ్ మీద ఘాటుగా స్పందించిన జగ్గారెడ్డి.. తనదైన శైలిలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తనపై ట్రోలింగ్ చేసేవాళ్లు దొరికితే.. బహిరంగంగానే బట్టలూడదీసి కొడతానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందాన్ని అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.