వాహనదారులకు తెలంగాణ పోలీసులు, రవాణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇక నుంచి మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఒకే వ్యక్తి మూడు సార్లు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో దొరికితే పోలీసుల సిఫార్సుల మేరకు రవాణాశాఖ అధికారులు లెసెన్స్ రద్దు చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.