హైదరాబాద్‌లోని రెండు వేర్వేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విషతుల్యం కావడంతో సుమారు 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చందునాయక్‌తండా ప్రభుత్వ పాఠశాలలో 44 మంది, బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకులంలో 7 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. వీరిని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, నిలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆహార కమిషన్ హెచ్చరికల తర్వాత కూడా నిర్లక్ష్యం కొనసాగుతుండటంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.