సినిమాల ప్రభావమో.. లేదా కాల వైపరిత్యమో కానీ.. అమ్మాయిలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. అమాయకులైన అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ నలుగురు మైనర్లు ఓ ఎనిమిదో తరగితి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.