విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ సంచలన ప్రకటన

1 year ago 15
Vizianagaram MLC By-Election Canceled: తీవ్ర సంచలనం రేపిన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందుకూరి రఘురాజుపై ఆంధ్రప్రదేశ్ మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేయగా.. ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ.. ఇందుకూరి రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని కొట్టేసింది. దీంతో ఉపఎన్నిక కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను.. ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది.
Read Entire Article