విజయవాడ దసరా ఉత్సవాల్లో పాల్గొనమని కోరుతూ తమిళనాడు సీఎం విజయ్‌కు నిర్వాహక బృందం ఆహ్వానించింది. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ వైభవాన్ని స్వయంగా వీక్షించాలని ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. సీఎం విజయ్‌ని ఆహ్వానించిన బృందంలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీష్ బాలయోగి కూడా ఉన్నారు. కాగా ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే దసరా సందడి మొదలైపోయింది. శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఘనంగా జరగనున్నాయి. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల సన్నాహాలు చేస్తున్నారు.