ఏపీ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచింది. రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపైనా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై మంత్రి నారాయణ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా.. ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటంతో మెట్రో నిర్మాణం దిశగా అడుగులు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.