Vijayawada Flood Areas Free Bike Services: విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాలను ఇటీవల బుడమేరు వరదలు ముంచెత్తాయి. దాదాపు పది రోజులపాటు అన్ని రకాల వాహనాలు నీటిలోనే ఉండిపోయాయి. అయితే నవ్యాంధ్ర ద్విచక్ర వాహనాల మెకానిక్‌ల సంక్షేమ సంఘం నేతలు స్పందించారు. విజయవాడ వరద బాధితుల బైక్‌లకు ఉచితంగా మరమ్మతులు చేసేందుకు ముందకొచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మెకానిక్‌లు ఉచితంగానే బైక్ రిపేర్లు చేస్తున్నారు.. ఆదివారం రోజు ఏకంగా 100మందికిపైగా విజయవాడకు వచ్చారు.