Nunna Ganesh Laddu Auction Rs 26 lakhs: విజయవాడలో గణేష్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. నున్న పంచాయతీ పరిధిలోని శ్రీసాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహం నిమజ్జనానికి ముందు నిర్వహించిన వేలం పాటలో.. ఓ ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ లడ్డు ప్రసాదాన్ని రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. వినాయక చవితి నిర్వహణ కమిటీ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు.