విరోష్ పెళ్లి సందర్భంగా.. విజయ్ దేవరకొండ తన స్వగ్రామంలో గ్రామ ప్రజలందరినీ పిలిచి వివాహ భోజనం పెట్టించాడు. పెళ్లి తర్వాత రష్మికతో తొలిసారి సొంతూరికి చేరుకున్న విజయ్.. పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరంతా పిలిచి పెళ్లి భోజనాలు పెట్టించాడు. ఇక త్వరలోనే వీరి రిసెప్షన్ హైదరాబాద్‌లో జరగనుండగా.. ఆ వేడుకకు హాజరు కావాలని ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందించారు.