తెలంగాణలోని భువనగిరి జిల్లా దుర్కపల్లి మండలం దత్తాయపల్లి ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రాజశేఖర్ గౌడ్, 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులైతే గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నారు. విద్యార్థులు పాస్ కావడంతో.. ఆయన ఇతర ఉపాధ్యాయులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. విద్యార్థుల పట్ల వారికున్న ప్రేమ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమై, అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు స్ఫూర్తినిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.