విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజుల డబ్బులు.. నెల రోజుల్లో మరో లక్ష మందికి లబ్ధి

4 days ago 5
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి సంక్షేమ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాల చెల్లింపులు వేగవంతమయ్యాయి. నాలుగు నెలల్లో 2.28 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.930 కోట్లు జమ చేసింది. ఇందులో రూ.811 కోట్లు బోధన ఫీజులు, రూ.119 కోట్లు ఉపకార వేతనాలు ఉన్నాయి. మొత్తం 5.8 లక్షల దరఖాస్తులు అందగా.. 4.79 లక్షల మంది బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించారు. డిసెంబరు నాటికి రూ.1,800 కోట్లకు పైగా చెల్లించి మార్చి నాటికి బకాయిలు లేకుండా చూడాలని సంక్షేమశాఖలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Read Entire Article