ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. గత ఆరేళ్లుగా రూ. 8 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విమర్శించారు. ఫీజులు రావడం లేదనే పేరుతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. నవంబర్ మొదటి వారంలోగా బకాయిలు విడుదల చేయకపోతే 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.