ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్ పేరుతో డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన కోర్సులు అందిస్తున్నారు. రెండేళ్ల కాలంలో 4253 మంది డిగ్రీ విద్యార్థులు, 1200 మంది ఇంజినీరింగ్ విద్యర్థులకు, వెయ్యి మంది నిరుద్యోగులకు వీటిపై శిక్షణ కల్పించారు. జర్మనీలో నర్సింగ్ కోర్సు చేసే వారికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించేలా కోర్సులు ఇస్తున్నారు. వీటితో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి క్యాంపస్ ఇంటర్వ్యూలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.