ఏపీలోని విద్యార్థులకు పండగలాంటి వార్త. విద్యార్థులకు స్కూల్ పుస్తకాల మోత తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్నిచోట్ల ఈ విధానం అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలుకోసం ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు నిధులు మంజూరుచేసింది. ప్రాథమిక పాఠశాలలకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా నిధులు మంజూరు చేస్తోంది. ఈ నిధుల సాయంతో ఈ కార్యక్రమం అమలు కోసం కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేయనున్నారు.