ఏపీలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పండగ సెలవులు పూర్తి కావటంతో బస్టాండులో రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే విజయవాడకు వెళ్లే బస్సు రాగా.. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్‌కు ఫిట్స్ రావటంతో బస్సు ప్రమాదానికి గురైన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలంలో చోటుచేసుకుంది.