ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాల కారణంగా నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. భార్యలు భర్తలను, భర్తలు భార్యలను చంపడానికి అనేక మార్గాలను అనుసరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. విచక్షణ రహితంగా, కిరాతకంగా నేరాలకు పాల్పడుతున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలు పెరిగిపోయాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఈ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ తరహా నేరాలను అరికట్టడానికి.. ప్రభుత్వం కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.