Woman Assaulted In Visakha Express Train: పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన వివాహితపై విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యాచారం జరిగింది. విశాఖపట్నం నుంచి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఆమెకు మాయ మాటలు చెప్పి ఏసీ బోగీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ నెల 26న ఘటన జరిగింది.. మంగళవారం బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.